సముద్ర తీర ప్రాంతాల్లో నివాసించేవారిలో ఈ లక్షణం ఉంటుంది

సాధారణంగా సైకాలజీ సబ్జెక్ట్ ని సముద్రంతో పోలూస్తూంటారు..ఎందుకంటే దాని లోతు, దారి, తెన్నూ పూర్తిగా తెలుసుకోవటం కష్టమని. అది కేవలం పోలికే అంతకు మించి ..సైకాలజీకు సముద్రానికి లింక్ ఏమీ లేదనుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని పరిశోధనలతో.. సముద్రానికి మన మానవ సైకాలజీకు రిలేషన్ ఉందని తేల్చారు. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా చాలా కాలంగా పరిశోధనలు జరుగాయి. వారు తేల్చింది ఏమిటంటే.. సముద్రానికి దగ్గరగా జీవించేవారి మానసిక పరిస్థితి బావుంటుంది. ముఖ్యంగా మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకనే గతంలో ..డిప్రెషన్ కు లోనైన వారిని లేదా మానసికంగా కాస్తంత ఇబ్బందిగా ఉండేవారిని సముద్రం ఒడ్డు లేదా నది ఒడ్డు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ప్రకృతిలో గడపమని డాక్టర్స్ ఆదేశించేవారు.
అలాగే సముద్రాన్ని తరచూ చూస్తుండటం వల్ల మానసికంగా బలంగా తయారు అవుతారని మిచిగాన్ యూనివర్శిటీ రచయిత అంబర్ ఎల్. పీర్సన్ తేల్చి చెప్పారు. అడవులు, ఆటస్థలాలు, పచ్చికబయళ్లు చూసేవారితో పోలిస్తే సముద్రానికి దగ్గరగా ఉండే వారికి సైకలాజికల్ సమస్యలు ఉండవని తేలింది. ఆటస్థలాలు, అడవులు, న్యూజిలాండ్, పసిఫిక్ సముద్రంలోని దక్షిణభాగం.. ఇలా సముద్రాలకు దగ్గరగా ఉండే మనుషుల మానసిక పరిస్థితుల డేటా అంతా తీశారు. పచ్చదనంలో ఏదో ప్రత్యేకత,హాయి ఉన్నా.. చివరికి సముద్రానికి దగ్గర ఉండే వారి మనసు ప్రశాంతంగా ఉంటుందని తేల్చారు. ముఖ్యంగా మూడ్ డిజాస్టర్స్ సముద్ర తీర ప్రాంతవాసుల్లో లేవని గమనించారు. కాబట్టి సముద్రం దగ్గరగా ఉన్న ఏదో ఒక ఊరులో నివాసం పెట్టుకోండి..హ్యాపీగా సముద్రాన్ని చూస్తూ ..సంతోషంగా ఉండండి అని శెలవిస్తున్నారు.